Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ నుంచి పారిపోయి హర్యానా (Haryana)లో తలదాచుకున్నట్లు పోలీసులు (Police) తాజాగా గుర్తించారు. హర్యానా (Haryana) వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కురుక్షేత్ర (Kurukshetra )లోని షహబాద్ ప్రాంతంలో (Shahabad area) అమృత్‌పాల్ (Amritpal Singh) సింగ్ ముఖం కనిపించకుండా గొడుగు అడ్డుపెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో అక్కడికి వెళ్లి సోదాలు చేయగా అప్పటికే అతను పారిపోయాడు.
హర్యానాలో అతడికి బల్జీత్‌కౌర్ (Baljit Kaur) అనే మహిళ ఆశ్రయమిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌కు ఆశ్రయమిచ్చిన ఆ మహిళను హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ ఘటనపై హర్యానాలోని కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా మాట్లాడుతూ.. షహబాద్ ప్రాంతంలో నివసిస్తున్న బల్జీత్ కౌర్ అనే మహిళను తాము అరెస్ట్ చేశామని చెప్పారు. ఆమె తన ఇంట్లో అమృత్‌పాల్ సింగ్, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌లకు ఆదివారం ఆశ్రయం ఇచ్చారని తెలిపారు. ఆమెను పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
అయితే విచారణ సందర్భంగా అమృత్‌పాల్ ఉత్తరాఖండ్ వెళ్లినట్లు బల్జీత్ కౌర్ వెల్లడించినట్లు పోలీసులు వర్గాల సమాచారం. దీంతో ఆ రాష్ట్రానికి పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాఖండ్ నుంచి అతడు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి దేశం వీడి కెనడా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమృత్‌పాల్ దేశం వీడి వెళ్లకుండా భారత్-నేపాల్ సరిహద్దుల్లో (Indo Nepal Border) చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అతడిని పట్టుకునేందుకు సరిహద్దుల్లో పోస్టర్లు కూడా అంటించారు.
వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వరుసగా ఏడో రోజు శుక్రవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు 50కి పైగా వాహనాల్లో ఆయనను పోలీసులు వెంటాడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వారి నుంచి ఆయన తప్పించుకుని వేషాలు, వాహనాలు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతన్నాడు. అతనితో లింకు ఉన్న మద్దతుదారుల్ని కొందర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. వారిస్ పంజాబ్ దే కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొందర్ని అస్సాంలోని దిబ్రుఘర్‌లో ఉన్న జైలుకు తరలించారు.
Also Read..
Kapil Sibal | చట్ట ప్రకారం రాహుల్ అనర్హతకు గురైనట్టే : కపిల్ సిబాల్
Pradeep Sarkar | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Ajay Banga | భారత్ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి నామినీ అజయ్ బంగాకు కరోనా పాజిటివ్