Virat Kohli : రెండో వన్డేలో టీమిండియా విజయాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి అతను హుషారుగా డాన్స్ చేశాడు. వీళ్లిద్దరూ లయబద్దంగా స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను అలరించారు. వీళ్ల డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. కొందరు కోహ్లీ, ఇషాన్ డాన్స్ చేస్తుంటే ఫొటోలు, వీడియోలు తీశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో, టీమిండియా విక్టరీని అభిమానులు ఆస్వాదించడం కోసం బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ లేజర్ లైట్ షో ఏర్పాటు చేసింది. మ్యూజిక్ స్టార్ట్ కాగానే ప్రేక్షకులు ఈలలు వేస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 15న ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.
రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 215కు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. కేల్ రాహుల్ అర్థ శతకం(64)తో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. హార్దిక్ పాండ్యా (32), అక్షర్ పటేల్ (21) అతనికి సహకారం అందించారు. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
Virat Kohli And @ishankishan51 Dancing After The Match, Yesterday.🕺🕺😅💙#ViratKohli #IshanKishan #INDvSL @imVkohli pic.twitter.com/qUEJRT27YI
— virat_kohli_18_club (@KohliSensation) January 13, 2023