న్యూఢిల్లీ: పెహల్గామ్ ఘటనను(Pahalgam Terrorist Attack) ఖండిస్తూ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశాడు. బాధిత కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. పెహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ కూడా స్పందించారు. పెహల్గామ్ దాడి గురించి వింటే గుండె తరుక్కుపోతోందని, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నామని, ఈ దేశంలో ఇలాంటి హింసకు చోటు లేదు అని శుభమన్ గిల్ తన పోస్టులో పేర్కొన్నాడు. కశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నానని, బాధిత కుటుంబాలు తేరుకోవాలని ఆశిస్తున్నట్లు రాహుల్ తెలిపాడు. స్పృహ లేని హింసకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబ సభ్యుల తరపున ప్రార్థిస్తున్నట్లు అనిల్ కుంబ్లే తెలిపారు.
Virat Kohli’s Instagram story. 🙏 pic.twitter.com/ly4Oh59Kz0
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2025
పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ జట్టు తలపడనున్నది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్నది. అయితే ఈ మ్యాచ్‌ను చీర్‌లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు. ఇక ఆటగాళ్లు, అంపైర్లు తమ చేతులకు బ్లాక్ కలర్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించనున్నారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఓ నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా దాడిని ఖండించాడు.
Heartbreaking to hear about the attack in Pahalgam. My prayers are with the victims and their families. Violence like this has no place in our country.
— Shubman Gill (@ShubmanGill) April 22, 2025
Shocked and deeply saddened by the tragic attacks on innocent people in Pahalgam.
The affected families must be going through an unimaginable ordeal – India and the world stand united with them at this dark hour, as we mourn the loss of lives and pray for justice.
— Sachin Tendulkar (@sachin_rt) April 23, 2025