కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో అంపైరింగ్ తప్పిదాలు క్రికెట్ ప్రేమికుల మధ్య పెద్ద చర్చగా మారాయి. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇన్సైడ్ ఎడ్జ్ కనిపిస్తున్నా కూడా కోహ్లీని అవుట్‌గా ప్రకటించడంపై క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో జరిగిన ఒక ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది. న్యూజిల్యాండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో 16వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతి బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌తోపాటు కీపర్ వృద్ధిమాన్ సాహాను కూడా బురిడీ కొట్టించి బౌండరీకి వెళ్లింది.
అయితే ఆ పరుగులను బై గా ప్రకటించాల్సిన అంపైర్.. టేలర్ బ్యాట్ ఆ బంతిని తాకినట్లు భావించాడు. దీంతో నాలుగు పరుగులు ఇస్తున్నట్లు చెప్పాడు. ఈ నిర్ణయం కోహ్లీకి నచ్చలేదు. ‘అసలేం చేస్తున్నార్రా నాయనా వీళ్లు? ఒకపని చేయండి మీరు ఇక్కడకు వచ్చేయండి, నేను అక్కడ ఉంటా’ (యే క్యా కర్తే హై యార్ యే లోగ్ యార్.. మై ఉధర్ ఆ జాతా హూ తుమ్ ఇధర్ ఆజానా) అంటూ అంపైర్లకు సలహా ఇచ్చాడు.
కోహ్లీ ఇలా సెటైర్ వేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 140/5 స్కోరుతో నిలిచింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే నాలుగో రోజే మ్యాచ్ ముగిసిపోవచ్చు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రా అవడంతో, ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంటుంది.
"Ye kya karte hain yaar ye log yaar"
— S´ˎ˗ | Captain Kohli 🛐 (@Kohlian_luvlush) December 5, 2021
"Main udhar aajata hu tum idhar aajao"
VIRAT KOHLI ISSA MOOD🤣😭#INDvsNZ pic.twitter.com/048dtpbyPg