ముంబై: సోషల్ మీడియా యూజర్లు విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతని ఇన్స్టా అకౌంట్ నుంచి .. నటి అవ్నీత్ కౌర్ పేజీలోని ఫోటోకు లైక్ వెళ్లింది. దీంతో ఆన్లైన్ యూజర్లు కోహ్లీ తీరుపై విమర్శలు చేశారు. ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్లు చేశారు. ఓ దశలో కోహ్లీ భార్య అనుష్కా శర్మను కూడా ఆ ట్రోల్స్లోకి లాగేశారు. ఆన్లైన్లో గుసగుసలు ఎక్కువ కావడంతో.. విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇన్స్టా స్టోరీలో కోహ్లీ ఓ పోస్టు చేశాడు. అవ్నీత్ కౌర్ ఫోటోకు లైక్ కొట్టినట్లు నేరుగా చెప్పకుండానే వివాదానికి తెర దింపాడు.
నటి పేరును వెల్లడించకుండానే.. తన ఇన్స్టా స్టోరీలో ఇలా రాశాడు. ఇన్స్టాలో ఫీడ్ క్లియర్ చేస్తున్న సమయంలో.. అనుకోకుండా ఆల్గోరిథమ్ పొరపాటు జరిగినట్లు చెప్పాడు. తనకు ఎటువంటి ఉద్దేశం లేదని, అనవసరంగా ఏదీ ఊహించుకోవద్దు అని, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నాడు. అనుష్కాకు బర్త్డే మెసేజ్ చేసిన మరుసటి రోజే కోహ్లీ తన క్లారిఫికేషన్ పోస్టు చేయాల్సి వచ్చింది.
Virat Kohli liked Avneet Kaur’s Instagram pic. yeah, I’d do the same. pic.twitter.com/teVmWAai4y
— Shiva Verma (@iShivaVerma) May 3, 2025