Virat Kohli : వన్డే ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాపై రెండు వన్డేల్లో శతకాలతో చెలరేగిన విరాట్.. వైజాగ్‌లో అర్ధ శతకంతో మెరిసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ (Player Of The Series) అవార్డుకు ఎంపికకయ్యాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో విరాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం ఇది పన్నెండోసారి. దాంతో.. వన్డేల్లో అత్యధిక పర్యాయాలు ఈ అవార్డు గెలుచుకున్న రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు విరాట్. 11 పర్యాయాలు ఈ అవార్డు అందుకున్న శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya)ను కోహ్లీ అధిగమించాడు.
ఫార్మాట్ ఏదైనా సరే క్రీజులో ఉంటే పరుగుల వరదే అన్నట్టుగా ఆడే విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తనకు ఎంతో అచ్చొచ్చిన ఈ ఫార్మాట్లో రికార్డు సెంచరీలు బాదిన కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విజయాలతోనూ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో 302 రన్స్‌తో 12వసారి ఈ అవార్డు పట్టేశాడీ మాజీ కెప్టెన్. అయితే.. వన్డేల్లో అత్యధిక పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుపొందిన రికార్డు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉంది.
◾ Sachin Tendulkar -15
◾ Virat Kohli – 12
◾ Sanath Jayasuriya -11Kohli passes Jayasuriya with his 12th Player of the Series award in ODIs 👑 pic.twitter.com/dhhlpdfKsP
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2025
క్రికెట్ గాడ్‌గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన సచిన్ తన కెరీర్లో 15 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. మరో నాలుగైదు సిరీస్‌లు ఆడితే మాస్టర్ బ్లాస్టర్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం. ఇప్పటికే వన్డే సెంచరీల్లో సచిన్‌ను దాటేసిన కోహ్లీ.. రాంచీలో 52వ వన్డే శతకంతో అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల వీరుడిగా అవతరించాడు. అయితే.. ఇప్పటికైతే వచ్చే వరల్డ్ కప్ (ODI World Cup 2027)లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు విరాట్. మూడు ఫార్మాట్లలో కలిపితే విరాట్ 22వసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గౌరవాన్ని స్వీకరించాడు.
22 – Most Player of the Series Awards in International Cricket
Who else, but him? 👑🐐
Virat Kohli 🙇♂️🙇♂️🙇♂️ pic.twitter.com/8P1LV3fGgF
— Royal Challengers Bengaluru (@RCBTweets) December 6, 2025