Virat Kohli : వన్డే ఫార్మాట్లో రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. సిడ్నీ వన్డేలో అర్ధ శతకంతో మొదలైన విరాట్ పరుగుల ప్రవాహం అవిఘ్నంగా కొనసాగుతోంది. బీసీసీఐ కోరిక మేరకు విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లోనూ ఆడుతున్న కింగ్ కోహ్లీ.. అక్కడా రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే శతకంతో రెచ్చిపోయిన భారత స్టార్.. గుజరాత్‌పై అర్ధ శతకంతో మరో రికార్డు పట్టేశాడు. లిస్ట్ – ఏ క్రికెట్లో అత్యధిక సగటు నమోదు చేశాడు.
ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీతో తడాఖా చూపిస్తున్నాడు. వచ్చే ప్రపంచకప్ లక్ష్యంగా పదిహేనేళ్ల తర్వాత ఈ లీగ్‌లో ఆడుతున్న అతడు.. విధ్వంసక ఆటతో అందర్నీ ఫిదా చేస్తున్నాడు. శుక్రవారం గుజరాత్‌పై హాఫ్ సెంచరీతో కదం తొక్కిన విరాట్ మళ్లీ వంద కొట్టేలా కనిపించాడు. కానీ, 77 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అయినా సరే.. అత్యధిక సగటుతో ఆస్ట్రేలియా మాజీ ఫినిషర్ మైఖేల్ బెవాన్ (Michael Bevan) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును దాటేశాడు.
Highest Batting Average in List A Cricket :
1) Virat Kohli 🇮🇳 – 57.87
2) Michael Bevan 🇦🇺 – 57.86
3) Sam Hain 🏴 – 57.76
4) Shan Masood 🇵🇰 – 57.13
5) C Pujara 🇮🇳 – 57.01
– Virat Kohli once again tops the List, that’s why he’s the King of Cricket 👑pic.twitter.com/S2i6wsB27e
— Richard Kettleborough (@RichKettle07) December 26, 2025
‘నాటౌట్ కింగ్’గా పేరొందిన బెవాన్ సగటు లిస్ట్ ఏ క్రికెట్లో 57.86 కాగా.. కోహ్లీ 57.87తో అతడిని అధిగమించాడు. లిస్ట్ ఏలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొడుతూ అత్యల్ప మ్యాచుల్లోనే 16 వేల క్లబ్లో చేరాడు విరాట్. ప్రస్తుతం 343 మ్యాచుల్లో 57.60 సగటుతో 16,130 రన్స్ బాదాడు. ఇందులో 58 సెంచరీలు, 84 అర్ధ శతకాలు ఉన్నాయి.