Virat Kohli : ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి (Lionel Messi) భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ‘గోట్ ఇండియా టూర్’ (GOAT India Tour)లో భాగంగా తన బృందంతో కలిసి విచ్చేసిని సాకర్ మాంత్రికుడిని కలిసేందుకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పోటీపడుతున్నారు. క్రికెట్ గోట్ విరాట్ కోహ్లీ (Virat Kohli)సైతం మెస్సిని ప్రత్యక్షంగా చూసి, ఫొటో దిగేందుకు సిద్దమవుతున్నాడు. తన అభిమాన ఆటగాడిని చూసేందుకు విరాట్ కోహ్లీ శనివారం స్వదేశం వచ్చేశాడు. ముంబై విమానాశ్రంలో విరాట్ భార్య అనుష్క శర్మతో కలిసి మీడియా కంటపడిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
వన్డేల్లో మాత్రమే ఆడుతున్న కోహ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత లండన్ వెళ్లిపోయాడు. గోట్ ఇండియా టూర్లో భాగంగా లియోనల్ మెస్సి భారత్కు రావడంతో కోహ్లీ సైతం అతడిని కలుస్తాడనే వార్తలు వినిపించాయి. డిసెంబర్ 14న ముంబైలో మెస్సి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో విరాట్ రాకను ఊహించారంతా. అనుకున్నట్టే శనివారం కింగ్ కోహ్లీ, భార్య అనుష్కతో కలిసి ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల పర్యటనలో కోల్కతాలో సందడి చేసిన మెస్సితో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫొటోలు దిగి మురిసిపోయారు.
🚨 𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚: Virat Kohli is set to meet Lionel Messi tomorrow in India. pic.twitter.com/hv2fB0FoDu
— The Touchline | 𝐓 (@TouchlineX) December 13, 2025
కోల్కతా తర్వాత హైదరాబాద్లో వాలిపోయిన ఫుట్బాల్ స్టార్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి.. రాత్రి ముంబై విమానం ఎక్కనున్నాడు. ఇటీవలే సఫారీలపై వన్డే సిరీస్లో రెండు శతకాలతో రెచ్చిపోయిన విరాట్.. అత్యధిక పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న ఈ మాజీ కెప్టెన్ 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
VIRAT KOHLI AND ANUSHKA SHARMA IN MUMBAI. pic.twitter.com/DIINgpJ9c5
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2025