Mahakaleshwar Temple: మహాకాలేశ్వరుడిని దర్శించుకున్న కోహ్లీ, కుల్దీప్.. భస్మ హారతి సేవలో టీమిండియా క్రికెటర్లు
Mahakaleshwar Temple: ఉజ్జయినిలో కోహ్లీ, కుల్దీప్.. మహాకాలేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం 4 గంటలకు భస్మ హారతి పూజలో పాల్గొన్నారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా గుడికి వెళ్లారు. కివీస్‌తో మూడో వన్డే రేపు ఇండోర్‌లో జరగనున్న విషయం తెలిసిందే.
ఉజ్జెయిని: టీమిండియా క్రికెటర్లు కొందరు ఇవాళ ఉజ్జయిని మహాకాలేశ్వరుడి(Mahakaleshwar Temple) సేవలో పాల్గొన్నారు. బోలేనాథుడికి నిర్వహించే భస్మ హారతిలో పాల్గొన్నారు. మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు మరికొంత మంది క్రికెటర్లు మహాశివుడి దర్శనం చేసుకున్నారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ.. ఇండోర్‌లో ఆదివారం జరగనున్న మూడవ వన్డే కోసం రెఢీ అయ్యాడు. అయితే ఇవాళ ఉదయం 4 గంటలకు కొందరు క్రికెటర్లు మహాకాలేశ్వరుడి సన్నిధానికి విచ్చేశారు. నంది హాల్లో కూర్చున్న క్రికెటర్లకు పూజారులు తిలకం దిద్దారు. సుమారు రెండు గంటలకు పైగా కోహ్లీ, కుల్దీప్ భస్మ హారతిలో పాల్గొన్నారు. ఆ క్రికెటర్లకు నుదుటిపై పూజారుల గంధం పూశారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మహాకాలేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. జై శ్రీ మహాకాల్ అంటూ విరాట్ కోహ్లీ అన్నారు. మహాకాల్ ఆలయానికి రావడం సంతోషాన్ని ఇచ్చినట్లు కుల్దీప్ చెప్పాడు. టీ20 వరల్డ్‌కప్‌లో రాణించే విధంగా ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపాడు.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli, along with Kuldeep Yadav, offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/GirLTB7j6I
— ANI (@ANI) January 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

