Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇది కూడా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాటం కోహ్లీ విషయంలో కావడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మూడు బంతులు ఆడాడు. ఇందులో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే, 18 సంవత్సరాల కిందట.. ఏప్రిల్ 18న ఐపీఎల్ తొలి ఎడిషన్ మ్యాచ్ జరిగింది.
2008లో విరాట్ అరంగేట్రం చేసిన మ్యాచులో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరుగడం విశేషం. ఆ సమయంలో విరాట్‌కు 19 ఏళ్ల వయసు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విరాట్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదు బంతులు ఎదుర్కొని.. ఒక పరుగు చేసి అశోక్ దిండా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ బెంగళూరు కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆర్సీబీ మాత్రం 82 పరుగులకే కుప్పకూలి.. 140 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ బ్యాటర్స్ విఫలమయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు నిలువలేకపోయారు. ఒక్కొక్కరూ పెవిలియన్‌కు క్యూకట్టారు. 14 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యింది. ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పాటిదార్ మినహా ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. టిమ్ డేవిడ్ 26 బంతుల్లో ఐదుఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలువగా.. ఆ రత్వాత పాటిదార్ 23 పరుగులు చేశాడు. ఫిల్ స్టాల్ (4), విరాట్ (1), లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృణాల్ పాండ్యా (1), మనోజ్ భాండ్గె (1), భువనేశ్వర్ కుమార్ 8 పరుగులు చేయగా.. యష్ దయాల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండోస్థానంలో, ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉన్నది.