ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వింత దృశ్యం చోటుచేసుకుంది. టెస్టుల్లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చాలా వింతగా అవుటయ్యాడు. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను లబుషేన్ ఆదుకున్నాడు.
52 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కు వచ్చాడు. మిడ్ వికెట్ మీదకు నేరుగా బంతిని వేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవలకు వచ్చి ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి లబుషేన్ ప్రయత్నించాడు. కానీ ఆ షాట్ విఫలమైంది. లబుషేన్ ఇలాంటి షాట్లను గతంలో చాలాసార్లు ఆడాడు. అయితే ఈసారి అది కుదరలేదు.
కాలు జారడంతో తన బ్యాటెన్స్ ఆపుకోలేక అతను బొక్కబోర్లా పడిపోయాడు. ఆ బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అతను పెవిలియన్ చేరాడు. అంతే ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఇలా కూడా ఎవరైనా అవుటవుతారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఇంత కన్నా వింత అవుట్ మేమెప్పుడూ చూడలేదని అంటున్నారు.
One of the weirdest dismissals we've ever seen! 😱#Ashes pic.twitter.com/8Qp5rKprn8
— cricket.com.au (@cricketcomau) January 14, 2022
If Marnus Labuschagne was a bowler pic.twitter.com/QiA7Q3bXYH
— A. (@EdinsonChavanni) January 14, 2022
Steven Smith and Pat Cummins' on Marnus Labuschagne's dismissal. pic.twitter.com/cn2Nmh0bHD
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2022