Rachi ODI : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ(103 నాటౌట్) మరో శతకంతో రెచ్చిపోయాడు. స్వదేశంలో మునపటి విరాట్‌ను తలపించిన అతడు సూపర్ సెంచరీతో ఫ్యాన్స్‌ను అలరించాడు. రాంచీ వన్డేలో సిక్సర్లతో అలరించిన కింగ్ కోహ్లీ.. జాన్సెన్ ఓవర్లో డీప్ ఎక్స్ట్రా కవర్స్‌లో బౌండరీతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో అతడికిది 52వ శతకం. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీల వీరుడిగా చరిత్రకెక్కాడు విరాట్. అద్భుత క్షణాన్ని కెమెరాలో బంధించి మురిసిపోయారు రాంచీ స్టేడియంలోని అభిమానులు.
సొంతగడ్డపై తిరుగులేని రికార్డు కలిగిన విరాట్ కోహ్లీ వన్డేల్లో శతకంతో రెచ్చిపోయాడు. తనకెంతో ఇష్టమైన ఈ ఫార్మాట్లో 52వ శతకంతో తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు విరాట్. స్వదేశంలో ఒకే వేదికపై అత్యధక సెంచరీలు బాదడం ఇది మూడోసారి. ఇదివరకూ పుణే, విశాఖపట్ణంలో మూడేసి శతకాలు బాదిన కోహ్లీ.. ఇప్పుడు రాంచీలో మూడో వంద నమోదు చేశాడు.
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025