ముంబై: గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి దవాఖానలో చేరాడు. థానే జిల్లాలోని కల్హర్లో ఉన్న ఓ దవాఖానలోని ఐసీయూలో కాంబ్లీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో అతడు దవాఖానలో చేరగా వైద్య పరీక్షలలో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది.