Vinesh Phogat | మాడ్రిడ్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సత్తాచాటింది. స్పెయిన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో వినేశ్ ఫైనల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల 50కిలోల సెమీస్ బౌట్లో వినేశ్ 9-4తో క్యాథి డచక్(కెనడా)పై అద్భుత విజయం సాధించింది.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్ బౌట్లో ఈ యువ రెజ్లర్…కెనడాకే చెందిన మాడిసన్ పార్క్స్పై అలవోకగా గెలిచింది. వినేశ్..తుది పోరులో రష్యాకు చెందిన మారియా తుమ్రెకోవతో అమీతుమీ తేల్చుకోనుంది.