వినేశ్ అవార్డులు వాపస్
భారత కుస్తీవీరుల అవార్డుల వాపసీ పరంపర కొనసాగుతున్నది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికపై రగడ మలుపులు తిరుగుతూనే ఉన్నది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ సన్నిహితుడైన సంజయ్‌సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్‌కు వీడ్కోలు పలుకగా, బజరంగ్ పునియా, వీరేందర్‌సింగ్ బాటలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పయనించింది.
- బజరంగ్, వీరేందర్‌సింగ్ బాటలో వినేశ్
- అధ్యక్ష ఎన్నికపై కొనసాగుతున్న వ్యతిరేకత
- ఖేల్త్న్ర, అర్జున పురస్కారాలు వెనుకకు
న్యూఢిల్లీ: భారత కుస్తీవీరుల అవార్డుల వాపసీ పరంపర కొనసాగుతున్నది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికపై రగడ మలుపులు తిరుగుతూనే ఉన్నది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ సన్నిహితుడైన సంజయ్‌సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్‌కు వీడ్కోలు పలుకగా, బజరంగ్ పునియా, వీరేందర్‌సింగ్ బాటలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పయనించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించనందుకు తాను అందుకున్న ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డుతో పాటు అర్జున వాపస్ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి వెనుకకు ఇస్తున్నట్లు పేర్కొంది. దేశంలో మహిళా రెజ్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వినేశ్..ఎక్స్‌లో లేఖను పోస్ట్ చేసింది. ‘ఖేల్త్న్ర, అర్జున అవార్డులకు ప్రస్తుతం నా జీవితంలో సరైన విలువలేవు. దేశంలో ప్రతీ మహిళా గౌరవంగా బతకాలని అనుకుంటున్నది. అందుకే బరువు తొలిగించుకునేందుకు ఈ అవార్డులు వాపస్ ఇస్తున్నాం పీఎం సార్. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ పతకం గెలిచినప్పుడు మీరు ‘బేటీ బచావో..బేటీ పడావో’కు ఆమెను ప్రచారకర్తగా ప్రకటించారు. అప్పుడు సాటి మహిళలుగా అందరం గర్వపడ్డాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షి కెరీర్‌కు వీడ్కోలు పలుకడం చాలా బాధగా ఉంది. మేము ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మాత్రమే పనికొస్తామా? మీ ప్రభుత్వం మహిళా సాధికారత పట్ల సీరియస్‌గా ఉంటే మా సమస్యలపై దృష్టి పెట్టండి’ అని రాసుకొచ్చింది. సంజయ్‌సింగ్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే క్రీడాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

