Vijay Shankar : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు వీడ్కోలు పలికిన భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) అనుకున్నట్టే ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడనున్నాడు. పొట్టి క్రికెట్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నా అని చెప్పిన విజయ్ లంక ప్రీమియర్ లీగ్(LPL)లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎల్పీఎల్ ఆరో సీజన్లో క్యాండీ రాయల్స్(KandyRoyals) జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడీ పేస్ ఆల్‌రౌండర్. టీ20 ఫార్మాట్లో విజయవంతమైన విజయ్ శంకర్ శ్రీలంక గడ్డపై మెరవనున్నాడు.
ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అతడిని ఎల్‌పీఎల్‌లోని క్యాండీ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే.. ఎన్ని డబ్బులు చెల్లించింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. శంకర్‌తో పాటు ఏంజెలో మాథ్యూస్, హసరంగ(శ్రీలంక), మోయిన్ అలీ(ఇంగ్లండ్)లను క్యాండీ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. క్యాండీ జట్టుతో పాటు దంబుల్లా సిక్సర్స్, ఎస్సీ జాఫ్నా కింగ్స్, గాలే గల్లాంట్స్, కొలంబో కాప్స్ ఫ్రాంచైజీలు సైతం పలువురు ఆటగాళ్లను తీసుకున్నాయి.
🚨🚨 Kandy Royals sign Vijay Shankar for LPL 2026 pic.twitter.com/9Z389Ps9Vo
— Cricbuzz (@cricbuzz) May 26, 2026
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే విజయ్ శంకర్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ (Domestic cricket)కు కూడా అల్విదా చెబుతున్నట్టు తెలిపాడు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు, మరింత క్రికెట్ ఆడేందుకు ఈ రెండింటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీలకు, భారత జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐకి అతడు ధన్యవాదాలు తెలిపాడు.
🚨 NEWS ALERT 🚨
Vijay Shankar has been signed by the Kandy Royals for the upcoming Lanka Premier League season after recently announcing his retirement from Indian cricket! 🇱🇰🏏#LPL2026 #VijayShankar #KandyRoyals #Sportskeeda pic.twitter.com/lR3gdtzG6d
— Sportskeeda (@Sportskeeda) May 26, 2026
తమిళనాడుకు చెందిన విజయ్ 2012లో రాష్ట్ర జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. పదమూడేళ్లు సొంత జట్టుకు ఆడిన అతడు 2025-26 సీజన్లో త్రిపురకు మారాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు విజయ్. 2017లో సన్‌రైజర్స్‌కు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీతో.. ఆపై మూడేళ్లు మళ్లీ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగాడు.
India all-rounder Vijay Shankar has announced retirement from domestic cricket and #IPL to “pursue new opportunities” and “play more cricket”.#VijayShankar is from Tamil Nadu and joined #Tripura in domestic cricket ahead of the 2025-2026 season & played 12 ODIs and 9 T20Is for… pic.twitter.com/nfA2g1OZP3
— Salar News (@EnglishSalar) May 22, 2026
గుజరాత్ టైటాన్స్ 2022లో అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలవడంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఆటగాడిగా 2018-19 మధ్య కాలంలో 12 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడంతే. 2025లో సీఎస్కే గూటికి చేరిన విజయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో.. పంతొమ్మిదో సీజన్ వేలంలో అతడిని ఎవరూ కొనలేదు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.