
అస్సాంపై హైదరాబాద్ విజయం
వినూ మన్కడ్ ట్రోఫీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వినూ మన్కడ్ అండర్-19 ట్రోఫీలో హైదరాబాద్ దూసుకెళ్తున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఎలైట్ గ్రూప్-‘సి’టాప్లో నిలిచిన హైదరాబాద్.. శనివారం జరిగిన పోరులో 67 పరుగుల తేడాతో అస్సాంను చిత్తు చేసింది. విగ్నేశ్ రెడ్డి (102; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకానికి.. ఠాకూర్ తిలక్ వర్మ (81; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో మొదట హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. కృతిక్ రెడ్డి (40), శశాంక్ (33) ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో అస్సాం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 224 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో రిషిత్ రెడ్డి, శశాంక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.