US Open 2023 | యూఎస్ ఓపెన్‌లో కొత్త టెక్నాలజీ.. ఆటగాళ్ల ప్రవర్తనను గమనిస్తారిలా..!
US Open 2023 : క్రికెట్లో డీఆర్ఎస్(Decision Review System)తో ఆటగాళ్లు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయడం చూశాం. త్వరలో జరుగబోయే యూఎస్ ఓపెన్(US Open 2023)లో ఇలాంటి వ్యవస్థను చూడబోతున్నాం. అవును.. ఈ టోర్నీలో మొదటిసారిగా వీడియో రివ్యూ సిస్టం(Video Review System)ను ప్రవేశ పెట్టనున్నారు. ఇది అచ్చం....
US Open 2023 : క్రికెట్లో డీఆర్ఎస్(Decision Review System)తో ఆటగాళ్లు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయడం చూశాం. త్వరలో జరుగబోయే యూఎస్ ఓపెన్(US Open 2023)లో ఇలాంటి వ్యవస్థను చూడబోతున్నాం. అవును.. ఈ టోర్నీలో మొదటిసారిగా వీడియో రివ్యూ సిస్టం(Video Review System)ను ప్రవేశ పెట్టనున్నారు. ఇది అచ్చం డీఆర్ఎస్ లెక్కనే పనిచేస్తుంది. కాకపోతే దీన్ని చైర్ అంపైర్ పని సులభతరం చేయడం కోసం, ఆటగాళ్ల ప్రవర్తనను గమనించడం కోసం తీసుకొచ్చారు.
ఇప్పటికే ఈ వ్యవస్థను పలు ఏటీపీ టోర్నమెంట్లలో పరీక్షించి చూశారు. దాని పనితీరు నచ్చడంతో యూఎస్ ఓపెన్‌లోనూ ప్రవేశ పెట్టాలని నిర్వాహకులు భావించారు. దాంతో, వీఆర్ఎస్ వ్యవస్థను తీసుకొచ్చిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌గా యూఎస్ ఓపెన్ గుర్తింపు సాధించనుంది. ఆగస్టు 28 నుంచి యూఎస్ ఓపెన్ మొదల్వనుంది. దాంతో, ఇకపై చైర్ అంపైర్లు(Chair Umpires) లైన్ పాయింట్లపై నిర్ణయం తీసుకోవడం ఈజీ కానుంది.
చైర్ అంపైర్‌తో వాదిస్తున్న ప్లేయర్

అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై చర్యలు తీసుకునేందుకు వీఆర్ఎస్ ఎంతో ఉపయోగపడనుంది. చెప్పాలంటే ఇది రిఫరీల చేతిలోని మంత్రదండం లాంటిది. అంతేకాదండోయ్.. ఆటగాళ్లకు కూడా దీంతో చాలా లాభం ఉంది. డబుల్ బౌన్స్, ఫౌల్ షాట్స్ వంటి విషయాల్లో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేయొచ్చు.
అప్పుడు అన్ని దిశలా కెమెరా కోణాన్ని పరిశీలించి చైర్ అంపైర్ సరైన నిర్ణయం ప్రకటిస్తారు. వీఆర్ ఆపరేటర్ ఆ వీడియోను చైర్ అంపైర్‌కు, స్టేడియంలోని బిగ్ స్క్రీన్ మీద కనిపించేలా చేస్తాడు. దాంతో, ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా వీక్షించే వీలుంటుంది. ప్రత్యేక ఈవెంట్లలో ఇప్పటికే బాల్ ట్రాకింగ్(Ball-Tracking), ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్(Electronic line-calling) వంటి టెక్నాలజీ వాడుకలో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
BCCI – IDFC Bank | బీసీసీఐ మీడియా హక్కులు దక్కించుకున్న ఐడీఎఫ్సీ బ్యాంక్
Neeraj Chopra | పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

