న్యూఢిల్లీ: జపాన్‌లో 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024లో ఫ్రాన్స్‌లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2023 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా నీరజ్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆర్హత లభించింది.
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే ఈటెను 88.77 మీటర్ల దూరం విసరడం ద్వారా నీరజ్ ఫైనల్లో అడుగు పెట్టాడు. కాగా, 2022లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో కూడా నీరజ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు.