ఢిల్లీ: భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 42 ఏండ్ల ఈ హర్యానా క్రికెటర్.. సుమారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్లో భాగమయ్యాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి తన సుదీర్ఘ కెరీర్లో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడిన అమిత్.. టెస్టుల్లో 76, వన్డేల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 535 వికెట్లున్నాయి.
జాతీయస్థాయిలో కంటే ఐపీఎల్ ద్వారా అతడికి ఎక్కువ గుర్తింపు దక్కింది. ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో వంటి జట్లకు ఆడిన అతడు.. 166 వికెట్లు తీశాడు. మూడు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్‌గా మిశ్రా రికార్డులకెక్కాడు.