సుజుక (జపాన్): అచ్చొచ్చిన వేదికపై రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) మరోసారి సత్తాచాటాడు. ఆదివారం అతడు జపాన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో టైటిల్ విజేతగా నిలవడం అతడికి ఇదే మొదటిది కాగా జపాన్ గ్రాండ్ ప్రి రేసును గెలవడం వరుసగా నాలుగోసారి కావ డం విశేషం. క్వాలిఫయింగ్ రేసులో అదరగొట్టిన వెర్స్టాపెన్.. ఫైనల్ రేసును 1:22:06 నిమిషాల్లో (ఒక నిమిషం 22 సెకన్లు) పూర్తి చేశాడు. మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్, పియాస్ట్రి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.