IND vs AUS | ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కంగారూలతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ – 2023-25లో భాగంగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా.. ఐదు టెస్టులకు వేదికలు ఖరారు చేసినట్టు సమాచారం. ‘ది ఏజ్’లో వచ్చిన కథనం మేరకు ప్రఖ్యాత పెర్త్ క్రికెట్ స్టేడియం తొలి టెస్టుకు ఆతిథ్యమివ్వనుండగా డే అంట్ నైట్ టెస్టు అడిలైడ్‌లో జరుగనుంది.
నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లే భారత్.. అక్కడ సుమారు రెండున్నర నెలల పాటు ఉండనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో తొలి టెస్టు జరగాల్సి ఉండగా అడిలైడ్‌లో రెండో టెస్టు (డే అండ్ నైట్)కు ఆతిథ్యమివ్వనుంది. మూడో టెస్టు బ్రిస్బేన్‌లో నిర్వహించాల్సి ఉండగా.. ఆస్ట్రేలియాకు అత్యంత ఇష్టమైన బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) మెల్బోర్న్లో జరుగనుంది. చివరిదైన ఐదో టెస్టుకు సిడ్నీ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
Venues for India vs Australia Test series 2024-25: [The Age]
1st Test – Perth
2nd Test – Adelaide (D&N)
3rd Test – Brisbane
4th Test – Melbourne (Boxing Day)
5th Test – Sydney (New Year Test) pic.twitter.com/NqdHKkNknx— Johns. (@CricCrazyJohns) March 18, 2024
ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా పూర్తిస్థాయిలో వెలువడాల్సి ఉంది. ఈ నెలచివర్లో గానీ లేదా వచ్చే నెలలో గానీ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్టు ‘ది ఏజ్’ కథనం పేర్కొంది. డిసెంబర్ – జనవరిలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ కూడా ఉన్నందున ఆ షెడ్యూల్‌తో టెస్టు సిరీస్ క్లాస్ కాకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత రెండు పర్యటనలలో భారత జట్టు విజేతగా నిలిచిన నేపథ్యంలో ఈసారి మాత్రం భారత్‌కు ట్రోఫీ వదులుకోకూడదనే పట్టుదలతో కంగారూలు ఉన్నారు.