హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాలపై తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు కొల్లగొట్టేందుకు తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల కోసం టీ20 టోర్నీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తాము ఎప్పుడు ముందుంటామని చెప్పుకునే మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబం అవినీతి కేసుల్లో నిందితుడైన శివలాల్యాదవ్తో కలిసి విలేకర్ల భేటీలో పాల్గొనడం ఏంటని అల్లీపురం ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ‘2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి 4.32 కోట్లు ఇచ్చి ప్రస్తుతం వడ్డీలతో కలిపి 67 కోట్లు అడగడం అన్యాయం. ఒక పక్క కోర్టులో కేసులు వేసి వడ్డీలతో కలిపి డబ్బులు చెల్లించాలనడం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు.