KSCA : కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికల్లో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిన్నస్వామి స్టేడియాని (Chinnaswamy Stadium)కి పూర్వ వైభవం తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని పేర్కొన్నాడు ప్రసాద్. స్వతహాగా బీజేపీ మద్దతుదారుడైన ప్రసాద్ ఎన్నికల్లో విజయం అనంతరం కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar)కు కృతజ్ఞతలు తెలిపాడు. కాంగ్రెస్ సర్కార్‌తో కలిసి చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌ల పునరుద్దరణకు కృషి చేయనున్నాడు మాజీ స్పీడ్‌స్టర్.
హైకోర్టు జోక్యంతో వాయిదా పడిన కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికలు డిసెంబర్ 7న ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడిన వెంకటేశ్ ప్రసాద్‌కు మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్‌లు మద్దతు తెలిపారు. ఆద్యంతం ఆసక్తి రేపిన కేఎస్‌సీఏ ఎన్నికల్లో ప్రసాద్‌కు 749 ఓట్లు రాగా.. ప్రత్యర్థి శాంత కుమార్ 558 ఓట్లతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపాడు.
Humbled to take on the responsibility as KSCA President.
Committed to bringing IPL and international cricket back to Chinnaswamy, and to working for the growth of Karnataka cricket at all levels.
With teamwork, transparency and dedication ,we will get there.”
Thank you to every…— Venkatesh Prasad (@venkateshprasad) December 7, 2025
‘కృతజ్ఞతలు సార్. మీ మద్దతు ఎంతో విలువైనది. మనం ఒక్కటిగా నడిచి కర్నాటకలో పారదర్శకతతో కూడిన క్రికెట్ కార్యచరణకు రూపం ఇద్దాం. చిన్నస్వామి స్టేడియంను మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా మార్చుదాం అని డీకే శివకుమార్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వెంకటేశ్ ప్రసాద్’ తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు. గేమ్ ఛేంజర్స్ టీమ్ నుంచి వెంకటేశ్ ప్రసాద్, టీమ్ బ్రిజేశ్ నుంచి కే.ఎన్. శాంత్ కుమార్ పోటీ చేశారు.
కర్నాటకకు చెందిన వెంకటేశ్ ప్రసాద్ గతంలో (2013-16) నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ దఫా కేఎస్‌సీఏ బాస్‌గా ఎంపికైన అతడు.. సుపరిపాలన, పారదర్శకత అందించాలని భావిస్తున్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం క్రికెట్ మ్యాచ్‌లకు ఒక అద్భుతమైన చోటు. దాదాపు 50 ఏళ్లుగా ఈ మైదానంలో ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. అలాంటి వేదిక ఇప్పుడు బోసిపోయింది. మ్యాచ్‌ల నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఇన్నేళ్లలో ఒక్కసారి రాలేదు. ఆఖరికి సొంతగడ్డపై జరగాల్సిన మహారాజా టీ20 లీగ్ కూడా ఇతర వేదికలకు తరలిపోయింది. అందుకే.. మేము మళ్లీ ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషి చేస్తాం. ఏకసభ్యకమిషన్ లేవనెత్తిన ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారిస్తాం. నేను ఇదివరకూ చెప్పినట్టు ఈ స్టేడియాన్ని 1974లో నిర్మించారు. ప్రస్తుతం 34 వేల నుంచి 35 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే సీటింగ్ సామర్ధ్యం ఉంది. సీటింగ్ కెపాసిటీ మరో 15 వేలకు పెంచి.. 50 వేల మంది మ్యాచ్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తాం’ అని వెంకటేశ్ తెలిపాడు.
🚨VENKATESH PRASAD NEW PRESIDENT OF KSCA🚨
☑️ Votes to Venkatesh Prasad – 749
☑️ Votes to opponent Shanta Kumar – 558
Venkatesh Prasad previously spoke about bringing back RCB matches to Chinnaswamy now his team GAME CHANGERS won the elections
Dots are connecting for RCB… pic.twitter.com/ANtzbdvWvx
— Royal Champions Bengaluru (@RCBtweetzz) December 7, 2025
ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ సందర్భంగా జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నిర్వాహకుల అజాగ్రత్తే తొక్కిసలాటకు కారణమైందని మండిపడింది. ఏకసభ్య కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. చిన్నస్వామి స్టేడియం డిజైన్‌లో, నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పెద్ద మ్యాచ్‌ల నిర్వహణకు ఈ స్టేడియం ఏమాత్రం పనికిరాదని కర్నాటక క్రికెట్ సంఘానికి షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్ 19వ మ్యాచ్‌లు చిన్నస్వామి నుంచి తరలిపోనున్నాయనే వార్తల నేపథ్యంలో డిప్యూటీ సీఎం శివకుమార్ అదేం లేదని అన్నారు. ఈసారి బెంగళూరులోనే నిర్వహించి తీరుతామని భరోసానిచ్చారు.