Venkatesh Prasad : చిన్నస్వామి మైదానంలో బంతి పడి రెండు నెలలు దాటింది. తొక్కిసలాట (Stampede) తర్వాత న్యాయ విచారణ.. పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) నిరాకరించడం వంటి కారణాలతో ఈ మైదానంలో క్రికెట్ మ్యాచ్ల సందడే కనిపించడం లేదు. త్వరలోనే మహిళల వన్డే వరల్డ్ (Womens ODI World Cup) ఉన్నందున ఎన్వోసీ కోసం కర్నాటక క్రికెట్ సంఘం (KCA) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశడు. తొక్కిసలాట ఘటనతో అప్రతిష్టపాలైన చిన్నస్వామి స్టేడియానికి పూర్వ వైభం తీసుకొస్తానని అన్నాడు.
ప్రస్తుతం కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రఘురామ్ భట్ నేతృత్వంలోని సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 30న ముగియనుంది. దాంతో, కొత్త టీమ్ కోసం వచ్చే అక్టోబర్ – నవంబర్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొక్కిసలాటతో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు అడ్డంకులు ఎదుర్కొంటోంది కేసీఏ. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నస్వామి స్టేడియం చిక్కుల్లో పడిందంటున్న వెంకటేశ్ ప్రసాద్ తాము పగ్గాలు చేపడితే సుపరిపాలన అందిస్తుందని హామీ ఇస్తున్నారు.
🗣️ Venkatesh Prasad: ‘Want to bring cricket back to Chinnaswamy’
Prasad, who served as KSCA vice-president from 2013-2016, announced his candidature for contesting in the board elections
🔗 https://t.co/zF88At3gqb pic.twitter.com/Nr1eScAoSl
— ESPNcricinfo (@ESPNcricinfo) August 21, 2025
టీమిండియా తొలితరం పేసర్లలో ఒకడైన ఆయన చిన్నస్వామి ఇమేజ్ పెంచుతానని మాట ఇస్తున్నాడు. గతంలో (2013-16) నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఈసారి కేసీఏ చీఫ్గా సుపరిపాలన, పారదర్శకత అందించాలని భావిస్తున్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం క్రికెట్ మ్యాచ్లకు ఒక అద్భుతమైన చోటు. దాదాపు 50 ఏళ్లుగా ఈ మైదానంలో ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. అలాంటి వేదిక ఇప్పుడు బోసిపోయింది. మ్యాచ్ల నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఇన్నేళ్లలో ఒక్కసారి రాలేదు. ఆఖరికి సొంతగడ్డపై జరగాల్సిన మహారాజా టీ20 లీగ్ కూడా ఇతర వేదికలకు తరలిపోయింది. అందుకే.. మేము మళ్లీ ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తాం. మాపై విశ్వాసం ఉంచండి.
ఏకసభ్యకమిషన్ లేవనెత్తిన ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారిస్తాం. నేను ఇదివరకూ చెప్పినట్టు ఈ స్టేడియాన్ని 1974లో నిర్మించారు. ప్రస్తుతం 34 వేల నుంచి 35 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే సీటింగ్ సామర్ధ్యం ఉంది. మేము గెలిస్తే.. సీట్ల సంఖ్య పెంచుతాం. మరో 15 వేల వరకూ అంటే.. 50 వేల మంది మ్యాచ్ను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తాం’ అని వెంకటేశ్ తెలిపాడు.
Former #cricketer #VenkateshPrasad has announced his candidacy for the Karnataka State Cricket Association (#KSCA) elections following the #ChinnaswamyStadium stampede. He offered condolences to the victims and pledged to restore the stadium’s legacy and ensure safety reforms. pic.twitter.com/V35DeABn1Y
— Yasir Mushtaq (@path2shah) August 20, 2025
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ సందర్భంగా జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం నిర్వాహకుల అజాగ్రత్తే తొక్కిసలాటకు కారణమైందని మండిపడింది. ఏకసభ్య కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. చిన్నస్వామి స్టేడియం డిజైన్లో, నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పెద్ద మ్యాచ్ల నిర్వహణకు ఈ స్టేడియం ఏమాత్రం పనికిరాదని కర్నాటక క్రికెట్ సంఘానికి షాకిచ్చిన విషయం తెలిసిందే.