IPL 2026 Auction | ఐపీఎల్ వేలం 2026 సీజన్‌కు ముందు మంగళవారం అబుదాబి వేదికగా మినీ వేలం మొదలైంది. పది జట్లలో 77 స్లాట్స్ ఖాళీగా ఉండగా.. వేలంలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ జాబితాలో భారత జట్టు ఆటగాళ్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కామెరాన్ గ్రీన్ వంటి విదేశీ ఆటగాళ్లు సైతం ఉన్నారు. మినీ వేలం కోసం క్రికెటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 350 మంది క్రికెటర్లతో షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిని వివిధ వర్గాలుగా విడదీశారు. మొత్తంలో 16 క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ (జాతీయ జట్టుకు ఆడిన ప్లేయర్స్), 98 మంది క్యాప్డ్ ఓవర్సీస్ (జాతీయ జట్టుకు ఆడిన విదేశీ ప్లేయర్లు) ఉన్నారు. ఇక అన్క్యాప్డ్ పేయర్ల విషయానికి వస్తే 230 మంది అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 14 మంది అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ వేలంలో ఉన్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశానికి చెందిన ఒక క్రికెటర్ సైతం వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ గ్రీన్ అత్యధికంగా రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీపడ్డాయి. చివరకు ఆర్సీబీ రూ.7కోట్లకు తీసుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో వేలానికి వచ్చిన గస్ అట్కిన్సన్, రచిన్ రవీంద్ర, లియామ్ లివింగ్ స్టోన్ ప్రస్తుతం అమ్ముడవలేదు. రూ.2కోట్ల బేస్ ప్రైజ్ వేలంలోకి వచ్చిన ముగ్గురిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అలాగే, రూ.1కోటి బేస్ ప్రైజ్‌తో వచ్చిన వియాన్ ముల్డర్‌ను సైతం ఏ జట్టు తీసుకోలేదు. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగాను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌కు లక్నో జట్టు తీసుకుంది. దీపక్ హుడా (రూ.75 లక్షలు)ని తీసుకునేందుకు జట్లు ఆసక్తి చూపించలేదు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను రూ.కోటి బేస్ ప్రైజ్‌తో ముంబయి ఇండియన్ కొనుగోలు చేసింది. కేఎస్ భరత్ 7.5 మిలియన్ డాలర్లకు వేలంలోకి వచ్చినా.. ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. ఈ ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. రూ.1.50కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆఫ్ఘన్ ప్లేయర్ రహమనుల్లా గుర్బాజ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అలాగే, రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌కు బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఫిల్ అలెన్‌ను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. దాదాపు రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ అమ్ముడవలేదు. రూ.కోటితో వేలానికి వచ్చిన ఆకాశ్ దీప్ సైతం వేలంలో ఎవరూ కొనలేదు. రూ.2కోట్లకు న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. 7.5 మిలియన్లకు వేలానికి వచ్చిన శివమ్ మావి అమ్ముడవలేదు. జెరాల్డ్ కొయెట్జీ రూ.2కోట్లతో వేలంలోకి రాగా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇక శ్రీలంక బౌలర్ మతీషా పతిరానా కోసం ఢిల్లీ-లక్నో జట్లు పోటీపడుతున్నాయి. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. ఇప్పటి వరకు బిడ్ రూ.16కోట్లు దాటింది. దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.