KKR vs MI ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు దంచారు. వాన కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(42), మాజీ కెప్టెన్ సనితీశ్ రానా(33)లు ధనాధన్ ఆడారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. చివర్లో రింకూ సింగ్(20), రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్)లు బౌండరీలతో చెలరేగారు. దాంతో, కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేయగలిగింది.
వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో కోల్‌కతా ఆదిలోనే కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ పేసర్ల విజృంభణతో 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఫిలిప్ సాల్ట్()ను తుషార వెనక్కి పంపాడు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్(0)ను బమ్రా బౌల్డ్ చేశాడు. దాంతో, నరైన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్(42) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(7)తో కీలక పరుగులు చేశాడు.
Down the ground and far far away! 😎
Rinku Singh aiming for a strong finish 🔥🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvMI pic.twitter.com/3hy1NBCwy5
— IndianPremierLeague (@IPL) May 11, 2024
ముంబై అంటేనే విరుచుకుపడే వెంకటేశ్ సారథితో కలిసి మూడో వికెట్‌కు 30 రన్స్ జోడించారు. అయితే.. ఐదో ఓవర్ తొలి బంతికే అయ్యర్‌ను బౌల్డ్ చేసి కోల్‌కతాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా(33), ఆండ్రూ రస్సెల్(24) వేగంగా ఆడి ఐదో వికెట్‌కు 39 రన్స్ రాబట్టారు. ఆఖర్లో రింకూ సింగ్(20) తన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. బుమ్రా 16వ ఓవర్లో రింకూను ఔట్ చేసినా.. రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్) ఆరో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో, కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(239), పీయూష్ చావ్లా(228)లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
Innings Break!#KKR set a challenging 🎯 of 158 👌👌
Can #MI chase this down within 16 overs?
Scorecard ▶️ https://t.co/4BkBwLMkq0#TATAIPL | #KKRvMI pic.twitter.com/9FptzWidxN
— IndianPremierLeague (@IPL) May 11, 2024