ముంబై : భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. భారత్ తరఫున ఆమె 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. మిడిలార్డర్ బ్యాటర్‌గా గుర్తింపుపొందిన వేద.. 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు.
వన్డేలలో 49 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చిన వేద.. 8 అర్ధ శతకాల సాయంతో 829 రన్స్ చేసింది. పొట్టి ఫార్మాట్లో ఆమె 63 ఇన్నింగ్స్‌లలో 875 పరుగులు సాధించింది.