హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ జిమ్నాస్ట్, గాడియం పాఠశాల విద్యార్థి వైష్ణవి వ్యాస్ సత్తా చాటింది.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అద్భుత ప్రదర్శన చేసిన వైష్ణవి టేబుల్ వాల్ట్ ఈవెంట్లో స్వర్ణ పతం సొంతం చేసుకుంది. బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో 5వ స్థానం, ఆల్‌రౌండ్ విభాగంలో 7వ స్థానంతో ఆకట్టుకుంది.