DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడుతోంది. గత మ్యాచ్‌లో ముంబై ధాటికి చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాటర్లు ఈసారి పంజా విసరాలనుకుంటున్నారు. ఐదు విజయాలతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లినందున ముంబైకి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ తీసుకుంది.
ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు కచ్చితంగా గెలిస్తేనే రేసులో ఉంటుంది. కాబట్టి.. జెమీమా రోడ్రిగ్స్ బృందం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ముంబై జట్టు ఓపెనర్ జి.కమలిని(G.Kamalini) సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా ఈ యువ ఓపెనర్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో స్పిన్ సంచలనం వైష్ణవీ శర్మ(Vaishnavi Sharma) స్క్వాడ్‌లోకి వచ్చింది. ఢిల్లీతరఫున 16 ఏళ్ల దీయా యాదవ్ ఈ మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేస్తోంది. మంబై ఇండియన్స్ వికెట్ కీపర్‌గా రహిలా ఫిర్దౌస్ జట్టులోకి రాగా.. వైష్ణవీ డెబ్యూట్ క్యాప్ అందుకుంది.
🚨 Toss 🚨@DelhiCapitals have won the toss against @mipaltan and elected to bowl first.
Updates ▶️ https://t.co/GUiylordH6 #TATAWPL | #KhelEmotionKa | #DCvMI pic.twitter.com/l4bVbTCm3T
— Women’s Premier League (WPL) (@wplt20) January 20, 2026
ముంబై ఇండియన్స్ తుది జట్టు : హీలీ మాథ్యూస్, సంజీవన్ సంజన, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్, రహిలా ఫిర్దౌస్(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖెమ్నర్, వైష్ణవీ శర్మ, షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : షఫాలీ వర్మ, లిజెల్లె లీ(వికెట్ కీపర్), లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), దీయా యాదవ్, మరినే కాప్, నిక్కీ ప్రసాద్, లూసీ హామిల్టన్, స్నేహ్ రానా, శ్రీ చరణి, నందిని శర్మ.