Vaibhav Sooryavanshi: 22 బంతుల్లో 44 రన్స్.. 200 స్ట్రయిక్ రేట్‌తో వైభవ్ హిట్టింగ్
Vaibhav Sooryavanshi: వన్డేలోనూ టీ20 స్టయిల్లో ఆడేశాడు వైభవ్ సూర్యవంశీ. ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరిగిన వన్డేలో ఇవాళ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లో 44 రన్స్ చేసి ఔటయ్యాడు. 200 స్ట్రయిక్ రేట్‌తో వైభవ్ హిట్టింగ్ చేశాడు. మాజీ ప్లేయర్ అజయ్ జడేజా అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.
డంబుల్లా: శ్రీలంకతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఇవాళ ఆఫ్ఘనిస్తాన్-ఏ బౌలర్లను కాసేపు వణకించాడు. తొలుత టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే ఓపెనర్ సూర్యవంశీ ఇవాళ కొన్ని భీకర షాట్లతో చెలరేగాడు. 15 ఏళ్ల ఆ బ్యారట్ కేవలం 22 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దాంట్లో 9 ఫోర్లు ఉన్నాయి. ఇక స్ట్రయిక్ రేట్ ఏకంగా 200 ఉంది. హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో వైభవ్ ఔటయ్యాడు.
ఆరంభం నుంచి మ్యాచ్‌లో వైభవ్ ఎక్కువ బృంతుల్ని వృధా చేయలేదు. తొలి బంతికే అతను ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత అదే ఊపులో బ్యాటింగ్ కొనసాగించాడు. భారత్-ఏ జట్టు తొలి అయిదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 రన్స్ చేసింది. ఆఫ్‌సైడ్‌లో అతను గ్యాప్స్ చూసి మంచి షాట్స్ ఆడాడు. షార్ట్ పిచ్ బంతుల్ని ఈజీగా కొట్టేశాడు.
తొలి వికెట్‌కు ప్రభుసిమ్రన్ సింగ్‌తో కలిసి 74 రన్స్ జోడించారు. ఈ మ్యాచ్‌లో ప్రభుసిమ్రన్ 84 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు ఉన్నాయి. మాజీ ప్లేయర్ అజయ్ జడేజా అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రియాన్ష్ ఆర్యా 8 రన్స్‌కే ఔటయ్యాడు.
ప్రస్తుతం ఇండియాఏ జట్టు 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసింది. రుతురాజ్ 66 రన్స్ చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ క్రీజ్‌లో ఉన్నాడు.
It’s Vaibhav Suryavanshi show against Afghanistan 👏
Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥
This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS
— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

