IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అరంగేట్రం అదిరింది. ఓపెనర్‌గా వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడీ యంగ్‌స్టర్. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికి లాంగాఫ్ దిశగా కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దాంతో, ఈ లీగ్‌లో ఆడిన మొదటి బంతికే ఆరు పరుగులు రాబట్టిన పదో క్రికెటర్‌గా రికార్డు లిఖించాడీ కుర్రాడు.
ఆ తర్వాత అవేశ్ ఖాన్ బౌలింగ్‌లోనూ మొదటి బంతిని పేసర్ తల మీదుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. స్పిన్నర్లను సైతం సమర్ధంగా ఎదుర్కొన్న ఈ చిచ్చరపిడుగు .. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మర్క్రమ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
A #TATAIPL debut at just 1️⃣4️⃣ years & 2️⃣3️⃣ days 🫡
Vaibhav Suryavanshi broke into the record books and how 💥#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/lglZ3bRxmw
— IndianPremierLeague (@IPL) April 19, 2025
ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్‌లో.. మొదటి బంతినే స్టాండ్స్‌లోకి పంపిన వైభవ్ అరుదైన క్లబ్లో చేరాడు. ఈ మెగా టోర్నీలో ఈ ఘనత సాధించిన పదో క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. వైభవ్ కంటే ముందు ఈ పీట్ సాధించిన ఆ 10 మంది ఆటగాళ్లు ఎవరంటే..?
1. రాబ్ క్వినే – రాజస్థాన్ రాయల్స్
2. కెవొన్ కూపర్ – రాజస్థాన్ రాయల్స్
3. ఆండ్రూ రస్సెల్ – కోల్‌కతా నైట్ రైడర్స్
4. కార్లోస్ బ్రాత్‌వైట్ – ఢిల్లీ డేర్‌డెవిల్స్
5. అనికేత్ చౌదరీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
6. జవొన్ సియర్లెస్ – కోల్‌కతా నైట్ రైడర్స్
7. సిద్దేశ్ లాడ్ – ముంబై ఇండియన్స్
8. మహీశ్ థీక్షణ – చెన్నై సూపర్ కింగ్స్
9. సమీర్ రిజ్వీ – చెన్నై సూపర్ కింగ్స్
10. వైభ్ సూర్యవంశీ – రాజస్థాన్ రాయల్స్