INDA vs PAKA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండో మ్యాచ్‌లో భారత ఏ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(45) మినహా ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు. పాకిస్థాన్ ఏ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న వైభవ్ శుభారంభమిచ్చినా మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నమన్ ధిర్(35).. డెత్ ఓవర్లలో హర్ష్ దూబే(19) బ్యాట్ ఝులిపించడంతో భారత జట్టు స్కోర్ 130 దాటింది. పాక్ స్పిన్నర్లు విజృంభించడంతో టీమిండియా 19వ ఓవర్లలోనే 137కు ఆలౌటయ్యింది.
ఆసియా కప్ తొలి పోరులో దంచేసిన భారత బ్యాటర్లు పాకిస్థాన్ ఏపై మాత్రం తడబడ్డారు. టాస్ ఓడిన టీమిండియాకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(45), ప్రియాన్ష్ ఆర్య(10)లు శుభారంభమిచ్చారు. తొలి బంతినే బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. రెండో ఓవర్ చివరి రెండు బంతులను ఫోర్, సిక్స్‌గా మలిచాడు. మూడో ఓవర్లో బౌండరీ బాదిన ప్రియాన్ష్.. నాలుగో ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు. కానీ, అదే ఊపులో షాట్ ఆడబోయిన అతడు.. టైమింగ్ మిస్ అయ్యి మిడాఫ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చాడు.
Innings Break!
India A put up 1⃣3⃣6⃣ runs on the board.
Vaibhav Sooryavanshi top-scored with 45(28). 👍
Over to our bowlers now!
Scorecard ▶️ https://t.co/5Wk1PzTdTp#RisingStarsAsiaCup pic.twitter.com/hwHu0hAZa4
— BCCI (@BCCI) November 16, 2025
ప్రియాన్ష్ ఔటయ్యాక నమన్ ధిర్(36)తో కలిసి విలువైన రన్స్ జోడించిన వైభవ్ హాఫ్ సెంచరీకి మముందు ఔటయ్యాడు. అంతే.. అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ జితేశ్ శర్మ(5), నేహల్ వధేరా(8), అశుతోష్ శర్మ(0) వంటి స్లార్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆఖర్లో రమన్‌దీప్ సింగ్(11), హర్ష్ దూబే(16)లు పోరాడడంతో భారత ఏ కోలుఉకుంది. కానీ. 19వ ఓవర్లో అజిజ్ ఆఖరి రెండు వికెట్లు తీయగా 136కే భారత్ ఆలౌటయ్యింది.