Michael Vaughan | అచ్చం ఎడమచేతి షేన్ వార్న్‌లా.. కుల్దీప్ని ఆకాశానికెత్తేసిన మాజీ కెప్టెన్
Michael Vaughan : రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. తన మణికట్టు మాయాజాలంతో మ్యాచ్‌ను భారతవైపు...
Michael Vaughan : రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) విజయానికి చేరువైంది. ధ్రువ జురెల్(90) అసమాన పోరాటానికి న్యాయం చేస్తూ స్పిన్నర్లు ఇంగ్లండ్‌ను తిప్పేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. తన మణికట్టు మాయాజాలంతో మ్యాచ్‌ను భారతవైపు తిప్పాడు. దాంతో, ఈ చైనామన్ స్పిన్నర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
పనిగట్టుకొని మరీ భారత ఆటగాళ్లను విమర్శించే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) అయితే కుల్దీప్ను ఏకంగా దిగ్గజ స్పిన్నర్‌తో పోల్చాడు. రాంచీలో కుల్దీప్ అచ్చం దివంగత షేన్ వార్న్(Shane Warne)లా బౌలింగ్ చేశాడని వాన్ అన్నాడు.
The best compliment I can give @imkuldeep18 .. Today he has bowled today like a left armed Shane Warne .. #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) February 25, 2024
‘రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి నేనిచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. అతడు అచ్చం ఎడమ చేతి వార్న్‌లా బౌలింగ్ చేశాడు’ అని వాన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. రాంచీలో తొలుత బ్యాటుతో కీలక పరుగులు చేసిన కుల్దీప్ ఆ తర్వాత బంతితో ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టాడు.

గింగిరాలు తిరుగుతున్న అతడి బంతులనుఎదుర్కోలేక ఇంగ్లీష్ బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. డేంజరస్ జాక్ క్రాలే(60), బెన్ స్టోక్స్(4)లను బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లే(), ఓలీ రాబిన్సన్()లను వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. మొత్తంగా 15 ఓవర్లు వేసిన కుల్దీప్ 4 వికెట్లు తీసి 22 పరుగులిచ్చాడంతే.
Remembering my friend, Shane Warne, on his special day. Your legacy lives on, both in the cricketing world and in the hearts of those who knew you. Wishing you a heavenly birthday, Warney♥️ @ShaneWarne pic.twitter.com/bdr13jVygJ
— Kuldeep yadav (@imkuldeep18) September 13, 2023
తాను ఆఫ్ స్పిన్నర్ కాదు లెగ్ స్పిన్నర్ అని చెప్పే కుల్దీప్పై వార్న్ ప్రభావం చాలానే ఉంది. 2018-19లో భారత జట్టు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచింది. అప్పుడు జట్టులో ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవే. దాంతో, వార్న్ టీమిండియా నెట్స్‌లోకి వెళ్లి అతడికి విలువైన సలహాలు ఇచ్చేవాడు. ఆ పర్యటనలో కుల్దీప్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించిన అతడు 99 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను అతడు వార్న్‌కు అంకితం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

