న్యూఢిల్లీ : తొలి టీ20 ప్రపంచకప్ హీరో రాబిన్ ఊతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి బౌలౌట్‌లో భారత్‌ను గెలిపించిన ఈ వెటరన్ క్రికెటర్ బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, తనకు సహకరించిన కర్ణాటక క్రికెట్ సంఘానికి, ఆదరించిన అభిమానులకు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.