Under-19 World Cup : పురుషుల అండర్ -19 వరల్డ్ కప్ పోటీలకు అమెరికా (USA) అర్హత సాధించింది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ బెర్తు సాధించింది యూఎస్ఏ. దాంతో, మెగా టోర్నీ బరిలో నిలిచిన జట్ల సంఖ్య 16కు చేరింది. రెండేళ్ల క్రితం టాప్-10లో నిలిచిన జట్లతో పాటు ఆతిథ్య జింబాబ్వే (Zimbabwe) అర్హత సాధించింది. మిగతా ఆరు స్థానాలను క్వాలిఫయర్స్ విజేతలు సొంతం చేసుకున్నాయి. జింబాబ్వే, నమీబియా వేదికగా వచ్చే ఏడాది అండర్ -19 ప్రపంచ కప్ జరుగనుంది.
గత ఎడిషన్ ఫైనల్ చేరిన భారత్, ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్‌లో మెరుగైన రన్‌రేటు కారణంగా అఫ్గనిస్థాన్, ఆఫ్రికా క్వాలిఫయర్‌లో నమీబియాను ఓడించిన టాంజానియా బెర్తు దక్కించుకున్నాయి.
The teams for next year’s Under-19 World Cup are locked in 🔒 https://t.co/243cDZ1vjf pic.twitter.com/obrW4M8eYo
— ESPNcricinfo (@ESPNcricinfo) August 18, 2025
రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ టోర్నీలో ఒక్కో దాంట్లో నాలుగు చొప్పున నాలుగు గ్రూప్‌లు ఉంటాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్‌లో ఆడిన జపాన్, స్కాంట్లండ్ క్వాలిఫై అయ్యాయి. అమెరికా క్వాలిఫయ్సర్స్లో కెనడా, బెర్ముడా, అర్జెంటీనాకు షాకిచ్చిన అమెరికా వరల్డ్ కప్ రేసులోకి దూసుకొచ్చింది.
వరల్డ్ కప్ బరిలో ఉన్న జట్లు ఇవే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, అఫ్గనిస్థాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, యూఎస్ఏ.