Saurabh Netravalkar : టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య(USA) అమెరికా సంచలన విజయాలతో పెద్ద జట్లకు సవాల్ విసురుతోంది. పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన యూఎస్ఏ బలమంతా భారతగడ్డపై పుట్టినే కుర్రాళ్లే కావడం విశేషం. అవును.. వాళ్లే పాకిస్థాన్‌పై అమెరికాకు సూపర్ విక్టరీ అందించారు. ఆ మ్యాచ్‌లో సంచలన స్పెల్‌తో పాక్ బ్యాటర్లను వణికించిన పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ (Saurabh Netravalkar) అయితే సోషల్ మీడియాలో మస్త్ ట్రెండ్ అయ్యాడు. ఓవైపు ఒరాకిల్(Oracle) కంపెనీలో పెద్ద స్థాయి ఉద్యోగం చేస్తూనే.. క్రికెటర్‌గా తన కలను నిజం చేసుకున్న సౌరభ్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
టీమిండియాతో (జూన్ 12న) మ్యాచ్‌కు ముందు సౌరభ్ ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. అమెరికాలో ఇంజనీరింగ్ చదవడం కోసం భారత దేశాన్ని వీడినందుకు తానేమీ బాధ పడడంలేదని సౌరభ్ అన్నాడు. ‘నేను 2010లో భారత జట్టు తరఫున అండర్ -19 వరల్డ్ కప్ ఆడాను. అప్పుడే నేను ఇంజినీరింగ్ చదువుతున్నా. 2009-13 మధ్య నా డిగ్రీ పూర్తైంది.
Still on cloud 9️⃣ from the win against Pakistan! 🤩🔥#T20WorldCup | #WeAreUSACricket 🇺🇸
📸: ICC/Getty pic.twitter.com/0Cg8vx1uVv
— USA Cricket (@usacricket) June 8, 2024
అప్పుడే భారత్‌లోనే ఉండాలా? అమెరికాలోనే సెటిల్ అవ్వాలా?.. ఈ రెండింటిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఇండియాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. అయితే.. ఆ ఉద్యోగం కాదని.. మరో రెండేండ్లు క్రికెట్‌కే కేటాయించా. ముంబై జట్టుకు ఆడినప్పుడు ఎంతో కష్టపడ్డా. కానీ, తర్వాతి దశకు వెళ్లలేకపోయాను. దాంతో, ఇక నాకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ వైపు అడుగులేశా’ అని సౌరభ్ వెల్లడించాడు.
Saurabh Netravalkar Said : “I trained hard with everybody’s support, made it to the Mumbai team. I played for two seasons, but then I realised at the end of the second year, that I was in and out of the side and was not making it to the next stage, like the senior Indian team or… pic.twitter.com/43ynO829hC
— Vipin Tiwari (@Vipintiwari952_) June 11, 2024
ప్రపంచకప్ ఆరంభ పోరులో కెనడాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అమెరికా ఆ తర్వాత బలమైన పాకిస్థాన్ పని పట్టింది. సౌరభ్ 18 పరుగులకే రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. దాంతో, సూపర్ ఓవర్‌కు వెళ్లిన మ్యాచ్‌లో అమెరికా 19 రన్స్ చేసింది. అనంతరం పాక్ 13 పరుగులకే పరిమితమైంది.
Thank you, @KTVU for this article on our very own Saurabh Netravalkar! Read below! ⬇️ https://t.co/DVlZcRAkRP
— USA Cricket (@usacricket) June 8, 2024