న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ (Serena Williams) దూసుకుపోతున్నది. లేటు వయస్సులోనూ తనకు ఎదురులేదన్నట్లుగా ఆటతీరు కనబరుస్తున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 600 కూడా లేని 40 ఏండ్ల సెరేనా వరల్డ్ నంబర్ 2 ర్యాంకర్‌ను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో అనెట్ కొంటావెయిట్పై మూరుసగా మూడు సెట్లలో 7-6 (7/4), 2-6, 6-2 తేడాతో విజయం సాధించింది. దీంతో మూడో రౌండ్లో ప్రవేశించి తన కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవాలనే లక్ష్యానికి మరింతగా చేరువైంది.
కాగా, తాను త్వరలోనే టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్లు సెరెనా విలియ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ ఓపెన్ చివరి టోర్నీయే చివరిదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఆటతీరు చూస్తే మరికొన్నాళ్లు వింబుల్డన్‌లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Serena, surprised at her level? 😏 pic.twitter.com/QP41An73FE
— US Open Tennis (@usopen) September 1, 2022