US Open | జకోవిచ్ ఆశలు గల్లంతు.. యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్
US Open | అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్ జకోవిచ్ ఆశలు గల్లంతయ్యాయి. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు.

న్యూయార్క్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్ జకోవిచ్ ఆశలు గల్లంతయ్యాయి. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. దీంతో మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన సొంతం చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదెవ్కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. గతంలో యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.

కాగా, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని రోజులపాటు ఆగాల్సిందే. జకోవిచ్ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన చేరాడు. ముగ్గురు టెన్నిస్ వీరులు ఒకే నంబర్ వద్ద ఆగిపోవడం గమనార్హం.
ఆట ప్రారంభమైనప్పటి నుంచి చివరివరకు అత్యుత్తమ ర్యాంకుల్లో ఉన్న ఇద్దరిమధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది.

తొలి రెండు సెట్లలో 6-4 తేడాతో జకోవిచ్‌పై మెద్వెదెవ్ పైచేయి సాధించాడు. అయితే జకో అభిమానులంతా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో లాగా తిరిగి పుంజుకుంటాడని ఆశపడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రెండు సెట్లలో ఓడిపోయిన జకోవిచ్.. మిగిలిన సెట్లలో విజయం సాధించి ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అయితే చరిత్ర పునరావృతం చేస్తాడనుకున్న జకోకు మెద్వెదెవ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 25 ఏండ్ల మెద్వెదెవ్ వరుసగా మూడు సెట్లలో గెలుపొంది.. తన మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

