PKL | నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 34-40 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓటమిపాలైంది. లీగ్‌లో వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ అదే దూకుడు కొనసాగించలేకపోయింది. టైటాన్స్ తరఫున విజయ్ మాలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ (4) గాయం కారణంగా తొలి 10 నిమిషాల్లోనే ఆటకు దూరమయ్యాడు.
ఇది టైటాన్స్ గెలుపు అవకాశాలను ఒక రకంగా దెబ్బతీసింది. మరోవైపు యోధాస్ తరఫున భవానీరాజ్పుత్ (12), ఆల్‌రౌండర్ భరత్ (11) సూపర్-10తో సత్తాచాటారు. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆది నుంచే సత్తాచాటింది. అటు రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌లో వరుస సాయింట్లతో యోధాస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. టైటాన్స్ తరఫున సెహ్రావత్ తొలి పాయింట్ అందుకున్నాడు. డిఫెండర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పవన్ మోకాలికి గాయమైంది. దీంతో అతను వెంటనే మైదానాన్ని వీడాడు. కీలకమైన ద్వితీయార్ధంలో యోధాస్ అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూ ముంబా 35-32తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.