WPL 2024 | టాస్ గెలిచిన యూపీ వారియర్స్.. బోణీ కొట్టేదెవరో..?
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో మరో మ్యాచ్‌కు కాసేపట్లో తెరలేవనుంది. రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), యూపీ వారియర్స్(UPW) జట్లు...
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో మరో మ్యాచ్‌కు కాసేపట్లో తెరలేవనుంది. రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), యూపీ వారియర్స్(UPW) జట్లు తలపడుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ అలీసా హేలీ బౌలింగ్ తీసుకుంది.
అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఈ పిచ్‌పై 175 పరుగులు మంచి స్కోర్ అని చెప్పింది. తొలి సీజన్లో దారుణంగా విఫలమైన బెంగళూరు సొంత మైదానంలో బోణీ కొట్టాలనే కసితో ఉంది. మరోవైపు ఆల్‌రౌండర్లతో నిండిన యూపీ విజయంతో టోర్నీని ఆరంభించాలని భావిస్తోంది.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన(కెప్టెన్), సోఫి డెవినె, సబ్బినేని మేఘన, ఎలీసా పెర్రీ, రీచా ఘోష్(వికెట్ కీపర్), సోఫీ మొలినెక్స్, జార్జియా వారేహమ్, శ్రేయాంక పాటిల్, సిమ్రాన్ బహదూర్, శోభన అశా, రేణుకా సింగ్.
🚨 Toss Update 🚨@UPWarriorz have elected to bowl against @RCBTweets
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/g8OwihtoqD
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
యూపీ వారియర్స్ జట్టు : అలీసా హేలీ(కెప్టెన్), సోఫీ ఎకిల్‌స్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్, కిరణ్ నవ్గరె, వ్రిందా దినేశ్, పూనమ్ ఖెమ్నర్, శ్వేతా షెరావత్, గ్రేస్ హ్యారిస్, సైమా థాకోర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

