UP vs GG : తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్‌కు రెండో మ్యాచ్‌లో షాక్ తగిలింది. యూపీ వారియర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు పెలియన్ చేరారు. సబ్బినేని మేఘన (24) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఎక్లెస్టోన్ ఓవర్లో కవర్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. గుజరాత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ సోఫియా డంక్లే (13)ను దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. హర్లీన్ డియోల్ (6), అన్నాబెల్ సౌథర్లాండ్ (1) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 45/2.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు డంక్లే, మేఘన ధాటిగా ఆడి శుభారంభం ఇచ్చారు. రెండో ఓవర్లో ఇద్దరు తలా రెండు ఫోర్లు కొట్టారు. దాంతో, ఆ ఓవర్లో 17 రన్స్ వచ్చాయి.