IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం ముగిసింది. దుబాయ్‌లోని కొకొకోలా ఎరెనా వేదికగా ముగిసిన వేలంలో పది ఫ్రాంచైజీలు 72 బెర్తుల కోసం రూ. 230.45 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ లు రూ. 20 కోట్ల మార్కును దాటగా పలువురు భారత దేశవాళీ ఆటగాళ్లూ భారీ ధర దక్కించుకున్నారు. కానీ వేలంలో మంచి ధర పొందుతారనుకున్న పలువురు జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు మాత్రం వేలంలో బొక్కబోర్లా పడ్డారు.
అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో బ్యాటర్ల జాబితా తీసుకుంటే స్టీవ్ స్మిత్, రస్సీ వాండెర్ డసెన్, కరుణ్ నాయర్, రోహన్ కన్నుమ్మల్, ఫిన్ అలెన్,జోష్ ఇంగ్లిష్, ఫిలిప్ సాల్ట్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు.
No takers for Steve Smith… he goes unsold #IPLAuction pic.twitter.com/hiAeWzzAC5
— cricket.com.au (@cricketcomau) December 19, 2023
బౌలర్లలో ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హెజిల్వుడ్, అదిల్ రషీద్, అకీల్ హోసెన్, ఇష్ సోధి, తబ్రైజ్ షంసీ, మురుగన్ అశ్విన్, దుష్మంత చమీర, మాట్ హెన్రీ, కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నేలు ఉన్నారు.
JOSH HAZLEWOOD UNSOLD…!!! pic.twitter.com/j7xy8iqjpt
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
ఆల్ రౌండర్ల జాబితాలో జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రాస్‌వెల్, కీమో పాల్, ఒడియన్ స్మిత్, హృతీక్ షోకీన్, కమలేష్ నాగర్కోటీలను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.