ఢిల్లీ: పోలండ్‌లో జరిగిన పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత యువ సంచలనం ఉన్నతి హుడా దక్కించుకుంది.
ఆదివారం ముగిసిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఉన్నతి.. 10-21, 21-15, 21-8తో పొలిన బుహ్రొవ (ఉక్రెయిన్)ను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకుంది. 47 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి తొలిగేమ్‌లో ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఉన్నతి జోరుకు ఉక్రెయిన్ అమ్మాయి తలవంచక తప్పలేదు.