Unmukt Chand | భారత మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి గాయం.. కన్ను తెరవలేని పరిస్థితి!
Unmukt Chand | టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఆడుతున్న ఢిల్లీ కుర్రాడు ఉన్ముక్త్ చంద్ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఆడుతున్న ఢిల్లీ కుర్రాడు ఉన్ముక్త్ చంద్ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అతను షేర్ చేసిన ఫొటోల్లో చంద్ ఎడమ కన్ను బాగా వాచిపోయి ఉంది. కన్ను తెరవడం కూడా కుదరని స్థితిలో కనిపిస్తోంది.
ప్రస్తుతం మైనర్ లీగ్ క్రికెట్లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న చంద్‌కు ఆట మధ్యలోనే ఈ గాయమైంది.‘క్రీడాకారుడిగా ఉండటం ఎప్పుడూ సులభం కాదు. ఒక్కోసారి విజయంతో, మరోసారి పరాజయంతో ఇంటికి తిరిగొస్తాం. ఒక్కోసారి గాయాలు, దెబ్బలతో వస్తాం. ప్రమాదకరమైన గాయం కానందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటా. కష్టపడి ఆడండి, కానీ భద్రంగా ఉండండి. ఆ రెంటి మధ్య చిన్న తేడానే ఉంటుంది’ అని చంద్ ట్వీట్ చేశాడు.
2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న చంద్.. ఆ టోర్నీలో టీమిండియాను విజేతగా నిలిపాడు. ఫైనల్లో 226 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలో దిగగా.. చంద్ ఒక్కడే 111 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే భారత్‌లో అవకాశాలు దొరక్కపోవడంతో గతేడాది ఆగస్టులో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అమెరికా వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ ఆడాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
It’s never a smooth ride for an athlete. Some days you come home victorious, other days disappointed&there are some when you come home with bruises and dents.Grateful to God to have survived a possible disaster. Play hard but be safe. It’s a thin line.
Thanku for the good wishes pic.twitter.com/HfW80lxG1c— Unmukt Chand (@UnmuktChand9) October 1, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

