ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. బంగ్లాదేశ్‌తో బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగుల స్కోరు చేసింది. యంగ్ ఇండియా ఓపెన్ ఆదర్శ్ సింగ్ (96 బంతుల్లో 76, 6 ఫోర్లు), సారథి ఉదయ్ సహరన్ (94 బంతుల్లో 64, 4 ఫోర్లు) భారత్‌ను ఆదుకున్నారు. బంగ్లా బౌలర్లలో మరూఫ్ మృధ ఐదు వికెట్ల (5/43)తో చెలరేగాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. నాలుగో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (7) వికెట్‌ను కోల్పోయింది. వన్ డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ (3) సైతం విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఆదర్శ్ – ఉదయ్‌లు మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు చౌదరి రిజ్వాన్ మరో షాకిచ్చాడు. ఆదర్శ్‌ను ఔట్ చేయడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉదయ్ కూడా పెవిలియన్ చేరాడు.
Innings break!#TeamIndia set a 🎯 of
2️⃣5️⃣2️⃣ 👌🏻👌🏻Fifties from Adarsh Singh and Captain Uday Saharan 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/DFqdZaYujm#BoysInBlue | #U19WorldCup | #BANvIND pic.twitter.com/RV1MErr22E
— BCCI (@BCCI) January 20, 2024
లోయరార్డర్లో ప్రియాన్షు మోలియా (23), తెలంగాణకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాష్ రావు (17 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్), సచిన్ దాస్ (26 నాటౌట్)లు మెరుపులు మెరిపించడంతో భారత్ బంగ్లాదేశ్ ఎదుట పోరాడగలిగే లక్ష్యాన్ని ఉంచగలిగింది. మరి ఈ లక్ష్యాన్ని యువ భారత ఆటగాళ్లు ఏ మేరకు కాపాడుకుంటారో చూడాలి…