టీమిండియా నుంచి పిలుపందుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు మాజీ మెంటార్ ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేశాడు.
పఠాన్, సన్‌రైజర్స్ జట్టులో తన సహచరుడు అబ్దుల్ సమద్‌తో కలిసి ఉమ్రాన్ తన జీవితంలోని ఈ మధురమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. సౌతాఫ్రికా జట్టుతో స్వదేశంలో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం ఉమ్రాన్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
A tiny Celebration … #debut 🇮🇳 #UmranMalik pic.twitter.com/OzSBRoaRVZ
— Irfan Pathan (@IrfanPathan) May 23, 2022