IPL 2024 LSG vs GT : టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఆదిలోనే షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ విజృంభణతో రెండు వికెట్లు కీలక కోల్పోయింది. తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (6) ఔటయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన డికాక్. ఆ తర్వాత భారీ షాట్ ఆడి నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు.
దాంతో, 6 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే దేవ్‌దత్ పడిక్కల్(7)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. ఈ స్పీడ్‌స్టర్ దెబ్బతో లక్నో 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్(12), మార్కస్ స్టోయినిస్(14)లు ఆచితూచి ఆడుతున్నారు. ఓవర్లకు లక్నో స్కోర్.. 5 ఓవర్లకు లక్నో స్కోర్.. 42/2.