T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో సంచలనాల పర్వం మొదలైంది. అలాగాని పెద్ద జట్ల బ్యాటర్లు.. వరల్డ్ నంబర్ 1 బౌలర్లు రికార్డు నెలకొల్పలేదు. తొలిసారి మెగా టోర్నీ ఆడుతున్న ఉగాండా జట్టు (Uganda) బౌలర్ సంచలన స్పెల్‌తో కొత్త చరిత్రను లిఖించాడు. ఆఫ్రికా జట్టు పపువా న్యూ గినియా(PNG)తో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ పేసర్ ఫ్రాంక్ సుబుగా(Frank Subuga) రికార్డు స్పెల్‌తో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.
ఆఫ్ స్పిన్నర్ అయిన సుబుగా నాలుగు ఓవర్లలో రెండు మెయిడెన్స్ వేసి.. కేవలం 4 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అది కూడా 43 ఏండ్ల వయసులో సుబుగా తన బౌలింగ్ పటిమ చూపించి క్రికెట్ పండితులను ఔరా అనిపించాడు. సూపర్ స్పెల్‌తో అదరగొట్టిన సుబుగ దిగ్గజ బౌలర్లకు సాధ్యం కాని రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అంతేకాదు పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచిన సుబుగా మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో నేను నెరవేర్చుకోవాలనుకున్న కల ఇది అని న్నాడు.
Dreams come true. 🥹
Kudos to off spinner Frank Nsubuga who waited a whole 27 years to make his debut & in his first ever game at the age of 43 has set the most economical spell in T20 World Cup history!
His star performance inspired Uganda 🇺🇬 to a historic first ever victory. pic.twitter.com/BHBB5PSvJw
— Usher Komugisha (@UsherKomugisha) June 6, 2024
ప్రపంచ కప్‌లో తొలి విజయం తర్వాత ఉగాండా క్రికెటర్లు వెరైటీగా సంబురాలు చేసుకున్నారు. మైదానంలో వలయాకారంలో నిలబడి.. చప్పట్లు కొడుతూ తమ సంప్రదాయ నృత్యంతో ఖుషీ ఖుషీగా గడిపారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమని ఉగాండా సారథి బ్రియాన్ మసబా (Brian Masaba) తెలిపాడు.
Uganda captain – Pretty special win for us, first win at the World Cup. Doesn’t get more special than this. Super proud of this group of guys, put in the work, to get a win for their country at the World Cup is very special. It’s been quite a journey, 3-4 years of very hard work… pic.twitter.com/VeBafCRVbb
— Nibraz Ramzan (@nibraz88cricket) June 6, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన పీఎన్జీ జట్టు 77 పరుగులకే ఆలౌటయ్యింది. సుబుగాతో పాటు మరో ముగ్గరు రెండేసి వికెట్ల ప్రదర్శన చేయడంతో గినియా బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఉగాండా.. 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.