Womens ODI World Cup : మహిళల వన్డే ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక (Srilanka) తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. చమరి ఆటపట్టు (Chamari Athapaththu) కెప్టెన్‌గా బుధవారం 15మందితో కూడిన పటిష్టటమైన స్క్వాడ్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ విజేతగా నిలవని ఈసారి మ్యాచ్ విన్నర్లతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో మెగా టోర్నీ జరుగుతున్నందున.. అనుభవజ్ఞురాలైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉదేశికా ప్రదోధని(Udeshika Prabodhani)కి స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు.
చమరి ఆటపట్టు సారథ్యంలో లంక జట్టు గొప్పగా ఆడుతోంది. రెండేళ్ల క్రితం ఆసియా కప్‌లో భారత జట్టును ఓడించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది లంక. అప్పుడు ఫైనల్ ఆడిన జట్టులోని కవిష దిల్హరి, హర్షిత సమరవిక్రమ, సుంగంధిక.. ఇప్పుడు వరల్డ్ కప్ బృందలోనూ ఉన్నారు. 1997 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న లంక ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.
Veteran left-arm seamer Udeshika Prabodhani has returned to the Sri Lanka squad, led by Chamari Athapaththu, for the upcoming Women’s World Cup 🇱🇰
Read more 👉 https://t.co/RQrbhu1gqn pic.twitter.com/bEWhMMeulY
— ESPNcricinfo (@ESPNcricinfo) September 10, 2025
2013 ఎడిషన్‌లో ఐదో స్థానంలో నిలవడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. అయితే.. ఆటపట్టు కెప్టెన్ అయ్యాక ఆ జట్టు ఆటే మారిపోయింది. సో.. ఈసారి కచ్చితంగా లంక తొలి టైటిల్ కోసం గట్టిగానే పోరాడనుంది. ప్రపంచ కప్ ఆరంభ పోరులో భారత జట్టును శ్రీలంక ఢీకొననుంది.
శ్రీలంక స్క్వాడ్ : చమరి ఆటపట్టు(కెప్టెన్), కవిష దిల్హరి, ఇనొకా రణవీర, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, సుంగంధిక కుమారి, విష్మీ గుణరత్నే, అనుష్క సంజీవని, ఉదేశిక ప్రభోదని, ఇమేష దులానీ, దెవ్మీ విహంగ, అచినీ కులసూరియా, నీలాక్షక సిల్వా, పివుమీ వత్సలా, మల్కీ మదరా.